This Day in History: 2017-02-01

2017 : ఆంధ్రానైటింగేల్‌ జోలెపాళ్యం మంగమ్మ మరణం. భారతీయ న్యూస్ రీడర్, ఎడిటర్, ఉపాధ్యాయురాలు, రచయిత్రి. ఆల్ ఇండియా రేడియో (AIR)లో మొట్టమొదటి తెలుగు మహిళ న్యూస్ రీడర్‌.

 నేషనల్ ఆర్కీవ్స్ లో పరిశోధనలు చేసింది. కేంద్ర సమాచారశాఖ, విదేశాంగశాఖలలో కీలకమైన పదవులను నిర్వహించింది. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొదలైన సంస్థలలో జీవిత సభ్యురాలు. అనిబీసెంట్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు ఉపాధ్యక్షురాలిగా, గాంధీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అధ్యక్షురాలిగా, లోక్‌అదాలత్‌లో సభ్యురాలిగా వివిధ హోదాల్లో సేవలను అందించింది. ఇంగ్లీషు, తెలుగు భాషలలో పలు పుస్తకాలను రచించింది. న్యూఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం, సిద్ధార్థ కళాపీఠం (విజయవాడ) విశిష్ట అవార్డు మొదలైన సత్కారాలను పొందింది. సరోజినీ నాయుడు అనుయాయిగా ఈమె పేరుగడించింది. ఆంధ్రానైటింగేల్ అనే బిరుదును సంపాదించింది.

error: