This Day in History: 1995-05-05

1995 : నాగభూషణం చక్రవర్తుల మరణం. భారతీయ తెలుగు సిని హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నిర్మాత, రంగస్థల నటుడు. తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన పల్లెటూరు ఆయన మొదటి చిత్రం. 1950 నుండి 1980 వరకు సుమారు 395 చిత్రాలలో నటించాడు. రక్త కన్నీరులో నాగభూషణం పాత్ర అత్యంత ప్రజాదరణ పొందిన రంగస్థల పాత్రలలో ఒకటి, దీనిని ఆయనే నిర్మించాడు. తెలుగు సినిమాలలో ప్రత్యేకంగా సాంఘిక చిత్రాలలో ప్రతినాయకులకు గుర్తింపు తెచ్చిన నటుల్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన నటుడు. విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడతను. సాంగ్స్ అండ్ డ్రామా కమిటీలో సలహాసంఘ సభ్యునిగా, సినీ కళాకారుల సంక్షేమనిధి ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఆయనకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు వుంది. ఎన్ని సినిమాలు చేసినా నాగభూషణం రక్తకన్నీరు దేశవ్యాప్తంగా ప్రదర్శించబడుతూ ఆ 25ఏళ్ల పాటూ మూడు వందల మంది కళాకారులకు అన్నం పెట్టింది. తెరమీద హీరో వేషాల్లో అడుగడుక్కీ విఫలమవుతూ ఎంత విలన్ గా రాణిస్తూ వచ్చినా నిజజీవితంలో ఆయన కథానాయకుడే అని చెప్పడానకి ఇదొక్కటి చాలు.

error: