This Day in History: 1978-05-10

1978 : సునీత ఉపద్రష్ట జననం. భారతీయ నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు 3,000 సినిమా పాటలు పాడింది. 15 సంవత్సరాల వయసులో మొదటిసారిగా సినిమాలలో నేపథ్యగాయనిగా ప్రవేశించింది. శశి ప్రీతం సంగీత దర్శకత్వంలో గులాబి సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన “ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు” అనే పాట పాడింది. 2 సార్లు వివాహం చేసుకుంది. సాంస్కృతిక వ్యవహారాలు, మంత్రిత్వ (ప్రభుత్వ విభాగం) శాఖ, ఢిల్లీ వారి వద్ద నుండి, జానపద పాటలు కోసం ఢిల్లీలో మొదటి జాతీయ అవార్డు అందుకొంది. ఆల్ ఇండియా రేడియో (All India Radio) నుండి నేషనల్ అవార్డు,  వంశీ బర్కలి, భరత ముని, వార్తా వాసవి, నంది, ఫిల్మ్ ఫేర్ లాంటి అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకుంది.

 

error: