This Day in History: 2021-05-10

2021 : టిఎన్ఆర్ (తుమ్మల నరసింహారెడ్డి) మరణం. భారతీయ తెలుగు ఇంటర్వ్యూ హోస్ట్, సిని నటుడు, జర్నలిస్టు, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్, దర్శకుడు. “ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టిఎన్ఆర్” పేరిట ఆయన నిర్వహించే ఇంటర్వ్యూ సీరీస్‌ ద్వారా చాలా ప్రాచుర్యం చెందాడు. 1992లో టి.ఎన్.ఆర్. దేవదాస్ కనకాల వద్ద దర్శకత్వం గురించి నేర్చుకున్నాడు. ఆపైన సినిమా రచయిత ఎల్. బి. శ్రీరామ్ వద్ద సహాయ రచయితగా పనిచేశాడు. ఆ తర్వాత టెలివిజన్ జర్నలిస్టుగా పలు టెలివిజన్ ఛానళ్ళలో పనిచేశాడు. ఈటీవీలో ప్రసారమైన నేరాలు-ఘోరాలు కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించాడు. ఎన్ టీవీలో క్రైమ్ స్టోరీస్, క్రిమినల్ వంటి కార్యక్రమాలు రూపొందించి నిర్వహించాడు. ఐడ్రీమ్ మీడియాలో “ఫ్రాంక్లీ స్పీకింగ్‌ విత్‌ టిఎన్‌ఆర్‌” అన్న ఇంటర్వ్యూ సీరీస్‌లో ఇంటర్వ్యూయర్‌గా తెలుగు సినిమా ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశాడు. ఇంటర్వ్యూయర్‌గా ప్రాచుర్యం పొందాక టి.ఎన్.ఆర్.కు నటన అవకాశాలు పెరిగాయి. నేనే రాజు నేనే మంత్రి, జార్జ్ రెడ్డి, సుబ్రహ్మణ్యపురం, మళ్ళీ మళ్ళీ చూశా (2019) ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, జాతిరత్నాలు, ది రోజ్‌ విల్లా, నేడే విడుదల[9] వంటి సినిమాల్లో టి.ఎన్.ఆర్. పాత్రలు పోషించాడు.

error: