This Day in History: 1906-10-10

1906 : పద్మ విభూషణ్ ఆర్ కె నారాయణ్ (రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి) జననం. భారతీయ రచయిత.మాల్గుడి అనే ఒక కల్పిత పట్టణాన్ని సృష్టించి దానిలోని ప్రజలు, వారి వ్యవహారాల గురించి ధారావాహిక నవలలు, కథలు వ్రాసాడు. ఆంగ్ల భాషలో భారత సాహిత్యరంగపు ప్రారంభదశకు చెందిన ముగ్గురు గొప్ప రచయితలలో ఈయన ఒకడు. ముల్క్‌రాజ్ ఆనంద్, రాజారావులు మిగిలిన ఇద్దరు. ఆంగ్ల భాషలో భారతీయ సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఈయనకు పేరు ఉంది. భారతదేశానికి చెందిన ఆంగ్లభాషా నవలా రచయితలలో ఎన్నదగినవారిలో ఒకడు.

తన సాహిత్య జీవితములో అనేక పురస్కారాలను నారాయణ్ గెలుచుకున్నాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు,  పద్మ భూషణ్, రాయల్ సొసైటీ అఫ్ లిటరేచర్ చే “ఎ.సి.బెన్సన్ మెడల్”,  ఆ సొసైటిలో ఒక సభ్యుడు కూడా. 1982లో ఆయనను అమెరికన్ అకాడమీ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ వారు గౌరవ సభ్యుడుగా ఎన్నుకున్నారు. ఆయన పేరు పలుమార్లు సాహిత్యంలో నోబెల్ బహుమతికు పరిశీలించబడింది కాని ఆ పురస్కారం ఇతనికి దక్కలేదు.

యూనివెర్సిటీ అఫ్ లీడ్స్ (1967), మైసూరు విశ్వవిద్యాలయం (1976), ఢిల్లీ విశ్వవిద్యాలయం (1973) మొదలైన విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ లభించింది. సాహిత్యరంగానికి చేసిన సేవకు గుర్తింపుగా నారాయణ్ భారత రాజ్య సభకు ఆరు సంవత్సరాల కాలానికి నియమితుడైనాడు. 2000లో భారతదేశపు రెండవ అతి గొప్ప పౌరపురస్కారం పద్మ విభూషణ్ ఇతడిని వరించింది.

error: