This Day in History: 1923-05-14

1923 : పద్మ భూషణ్ మృణాల్ సేన్ జననం. భారతీయ సినీ దర్శకుడు, రజకీయవేత్త. బెంగాలీ, హిందీ భాషలలొ పనిచేశాడు. భారత పార్లమెంటుకు నామినేట్ చేయబడిన సభ్యుడు. సమకాలీకులైన సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్ లతో కలిపి భారతీయ సమాంతర సినిమాకు ప్రపంచ వేదికపై గొప్ప ప్రతినిధిగా పేరొందాడు.

ఫిల్మ్ ఫేర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డు తో పాటు అనేక ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్నాడు. ప్రపంచ సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌లు నెహ్రూ సోవియట్ ల్యాండ్ అవార్డును అందజేసారు. భారత ప్రభుత్వం సేన్‌కి పద్మభూషణ్‌తో సత్కరించింది. ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ మిత్రాండ్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్, ఆయనకి అందించిన అత్యున్నత పౌర గౌరవమైన కమాండర్ డి ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ (కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్)ని ప్రదానం చేశారు. బుర్ద్వాన్ విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డి. లిట్ లభించింది. జాదవ్పూర్ విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ D. లిట్‌ను అందుకున్నాడు. రవీంద్రభారతి విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డి. లిట్ లభించింది. రాజ్యసభలో భారత పార్లమెంటు గౌరవ సభ్యునిగా నియమించబడ్డాడు. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయనను ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్‌తో సత్కరించాడు. కలకత్తా విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ D. లిట్ అవార్డు లభించింది. ఆస్కార్ అకాడమీ సభ్యునిగా చేర్చబడ్డాడు.

 

error: