This Day in History: 1922-07-15

1922 : ‘మ్యూయాన్‌ న్యూట్రినో’, ‘బాటమ్‌ క్వార్క్‌’ అనే ప్రాధమిక కణాలను కనుగొన్న శాస్త్రవేత్త, కణ భౌతిక శాస్త్రం ఏర్పడడానికి కారకుడు, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత లియోన్‌ లెడర్‌మాన్ జననం

లియోన్ మాక్స్ లెడెర్మాన్ – మే 11, 2007 న లియోన్ ఎం. లెడెర్మాన్ లియోన్ ఎం. లాబొరేటరీ అల్మా మేటర్ సిటీ కాలేజ్ ఆఫ్ న్యూయార్క్ కొలంబియా విశ్వవిద్యాలయం న్యూట్రినోస్‌కు సెమినల్ రచనలకు పేరుగాంచింది, దిగువ క్వార్క్ గుర్తించదగిన అవార్డులు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి (1988) భౌతిక శాస్త్రంలో వోల్ఫ్ ప్రైజ్ (1982) నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ (1965) వన్నెవర్ బుష్ అవార్డు (2012) విలియం ప్రొక్టర్ సైంటిఫిక్ అచీవ్‌మెంట్ కోసం బహుమతి (1991) జీవిత భాగస్వామి ఫ్లోరెన్స్ గోర్డాన్ (3 పిల్లలు) ఎల్లెన్ కార్

కణాలు కనుగొని… నోబెల్‌ అందుకుని…! పరమాణువు కన్నా సూక్ష్మమైన ప్రాథమిక కణాలను కనుగొనడం ఎంత కష్టం? అలాంటి రెండు కణాల ఉనికిని ప్రయోగాత్మకంగా నిరూపించిన వాడే లియోన్‌ లెడర్‌మాన్‌. ఆయన పుట్టిన రోజు ! 1922 జూలై 15న . విశ్వంలోని పదార్థం (matter) ఎలా నిర్మితమైంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోడానికి మనిషి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే ప్రాచీన కాలంలో మన దేశానికి చెందిన కణాదుడు, గ్రీకు తత్వవేత్తలు ‘అతి సూక్ష్మమైన పరమాణువులు (atom) అనే కణాలతోనే విశ్వంలోని పదార్థం నిర్మితమైంది’ అనే అంచనాకు వచ్చారు. అయితే ఆ తర్వాత పరమాణువులోకి కూడా శాస్త్రవేత్తలు తొంగి చూడగలిగారు. దానిలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనే ప్రాథమిక కణాలు ఉంటాయని కనుగొన్నారు. మరైతే ఇలాంటివి ఇంకేమీ లేవా? ఇప్పటికీ వాటి అన్వేషణ సాగుతూనే ఉంది. భవనాల నిర్మాణంలో ఇటుకలను ఒకటిగా ఉంచడానికి సిమెంటు ఉపయోగపడినట్టుగానే, పదార్థాలలో ఉండే పరమాణువులను సంఘటితంగా ఉంచడానికి దోహదపడే శక్తిని సమకూర్చే కణాలు మరిన్ని ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కార్కులు (Quarks), మీసాన్లు (mesons), పయాన్లు (pions), మ్యూయాన్లు (muons), హైపరాన్లు (hyperons) లాంటి ప్రాథమిక కణాలు దాదాపు 200 వరకూ ఉన్నట్లు తేలింది. వీటి అధ్యయనం వల్ల’కణ భౌతిక శాస్త్రం’ (particle physics) అనే నూతన శాస్త్రం ఏర్పడింది.

ప్రాథమిక కణాల్లో ‘మ్యూయాన్‌ న్యూట్రినో’కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాని ఉనికిని కనిపెట్టిన శాస్త్రవేత్తే లియోన్‌ లెడర్‌మాన్‌. ఈ పరిశోధనకు 1988లో నోబెల్‌ బహుమతి అందుకున్నాడు. ఇతడే ‘బాటమ్‌ క్వార్క్‌’ అనే మరో ప్రాథమిక కణాన్ని కూడా కనిపెట్టడం విశేషం.

రష్యా నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కి వలస వచ్చిన యూదుల కుటుంబంలో 1922 జూలై 15న పుట్టిన లియోన్‌ మాక్స్‌ లెడర్‌మాన్‌ అక్కడే పట్టభద్రుడై ప్రపంచ యుద్ధ కాలంలో సేవలందించాడు. ఆ తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి 29 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పొందాడు. ఆపై అక్కడే ప్రొఫెసర్‌గా నియమితుడై పరిశోధనలు చేస్తూ ఎన్నో అవార్డులు అందుకున్నాడు.

విశ్వసృష్టి రహస్యాలను విప్పి చెప్పే కణ భౌతిక శాస్త్రం సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా లియోన్‌ లెడర్‌మాన్‌ రచించిన ‘ది గాడ్‌ పార్టికిల్‌’ సైన్స్‌ అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు

error: