This Day in History: 2018-11-17
2018 : పద్మశ్రీ అలిక్ పదంసీ మరణం. ‘గాంధీ’ సినిమాలో మహ్మదాలీ జిన్నా పాత్రలో నటించి అందరి మన్ననలను అందుకున్నాడు. భారత్‌లో అంతర్జాతీయ వాణిజ్య ప్రకటనల సంస్థ లింటాస్ కు 1980 నుంచి 1994 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించిన ఆయన ఆ సంస్థను దేశంలోనే అగ్రశ్రేణి అడ్వర్టైజ్మెంట్ సంస్థగా తీర్చిదిద్దాడు.70కి పైగా నాటకాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఎవిటా, జీసస్ క్రైస్ట్ సూపర్‌స్టార్, తుగ్లక్ ఎంతో ప్రాచుర్యం పొందాయి. తెలుగు సినీనటి షాజన్ పదంసీ ఈయన కుమార్తె.