This Day in History: 1952-06-22

1952: విశాలాంధ్ర తెలుగు దినపత్రిక ప్రారంభమైనది.

‘విశాలాంధ్ర’ తెలుగునేలపై తొలి దినపత్రికగా తన ప్రస్థానం ప్రారంభించింది. ఈ పత్రిక ఆరంభానికి చారిత్రక నేపథ్యం స్వదేశీ సంస్థానాల పాలనలో, బ్రిటిషు వారి పాలనలో చెల్లాచెదరైన తెలుగువారందరూ భౌగోళికంగా, పరిపాలనా పరంగా ఒక్కటి కావాలన్న ఆకాంక్ష బలంగా ఉన్న రోజులవి. రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్రలో ప్రజారాజ్యం పిలువునిచ్చింది. భాషా ప్రయుక్త రాష్ట్రోద్యమం సంకల్పానికి బలం చేకూర్చటమే ఈ పత్రిక చారిత్రక లక్ష్యం.




తెలుగు గడ్డపై కమ్యూనిస్టు ఉద్యమం 1933లో ప్రారంభమైంది. తెలుగుగడ్డపై వెలువడిన తొలి కమ్యూనిస్టు పత్రిక 1937 డిసెంబరు 15వ తేదీన రాజమండ్రిలో ప్రారంభమైన నవశక్తి . ఇది కొన్నాళ్ళు రాజమండ్రి నుంచి, మరికొన్నాళ్ళు విజయవాడ నుంచి వెలువడి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మూతపడింది. అటు పిమ్మట ‘స్వతంత్ర భారత్‌’గా రహస్యంగా ముద్రింపబడింది. అనంతర కాలంలో ‘ప్రజాశక్తి వారపత్రిక’గా 1942 లో ప్రారంభమైంది. పార్టీ ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన ‘ప్రజాశక్తి’ ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొని 1945నుంచి దిన పత్రికగా వెలువడింది. ఆ తరువాత 1948లో నిషేధించబడింది. అప్పుడు విజయవాడ నుంచి ‘జనత’, మద్రాసు నుంచి ‘సందేశం’, తెనాలి నుంచి ‘నగారా’, మద్రాసు నుంచి ‘జనవాణి’ వెలువడినవి.

ప్రజా పత్రికల గొంతుపై ఉక్కుపాదం మోపి పాలకులు నిర్బంధ పాలన సాగిస్తున్న ఈ కాలంలోనే సెట్టి ఈశ్వరరావు సంపాదకత్వంలో మద్రాసు నుంచి విశాలాంధ్ర పక్షపత్రిక ఒకటి వెలువడుతుండేది. అదే సమయంలో ఆంధ్ర కమ్యూనిస్ట్‌ కమిటీ విశాలాంధ్ర పేరుతో సైక్లోస్టయిల్‌ పత్రికను ప్రజలకు అందించింది. జాతీయోద్యమం విజయవంతమై భాషాప్రయుక్త రాష్ట్రాలకు ప్రజలు ఉద్యమిస్తున్న ఆ చారిత్రక దశలో విశాలాంధ్ర నినాదం ప్రజాభిమానం పొందింది. మూతపడిన ప్రజాశక్తి 1951 లో వార పత్రికగా వెలువడి, పాలకుల ఆంక్షల మధ్య కొన్నాళ్ళు ద్వైవారపత్రికగా వెలువడగా హైదరాబాద్‌ నుంచి ‘ప్రజాయుగం’ ప్రారంభమై కొద్దికాలం నడిచింది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రజల జాతీయాభిమానాన్ని, ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తూ ప్రజాభిమానం విశేషంగా పొందిన ‘విశాలాంధ్ర’ పేరుతో ఒక దిన పత్రికను నిర్వహించాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. సొసైటీల చట్టం కింద రిజిస్టరైన విశాలాంధ్ర విజ్ఞాన సమితి ఏర్పడింది. ఈ సంస్థ నిర్వహణలో విశాలాంధ్ర దినపత్రిక 1952 జూన్‌ 22 న విజయవాడ నుంచి ఆంధ్రవిశారద తాపీ ధర్మారావు చేతుల మీదుగా అసంఖ్యాక అభిమానుల మధ్య ప్రారంభమైంది

error: