This Day in History: 1940-06-24

మురళి మోహన్ మాగంటి




మాగంటి మురళీమోహన్ తెలుగు సినిమా కథానాయకుడు, నిర్మాత. జయభేరి గ్రూపు అధిపతి. 2014 లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజక వర్గం నుండి గెలిచాడు.

జీవిత విశేషాలు: ఇతని అసలు పేరు మాగంటి రాజబాబు. ఇతడు 1940జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతని విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది. ఇతడు 1963లో ఎలెక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించాడు. తరువాత ఇతడు విజయవాడలో నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు.




ఇతని భార్య పేరు విజయలక్ష్మి. వీరికి మధుబిందు అనే కుమార్తె రామమోహన్ అనే కుమారుడు ఉన్నారు.

సినిమా రంగం: 1973లో మురళీమోహన్ అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశాడు. దాసరి నారాయణరావు 1974లో తీసిన తిరుపతి సినిమాతో ఇతనికి నటునిగా గుర్తింపు వచ్చింది. ఇతడు సుమారు 350 తెలుగు చలనచిత్రాలలో నటించాడు. ఇతడు తన సోదరుడు కిశోర్‌తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారా 25 చిత్రాలను నిర్మించాడు. ఇతడు నేషనల్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో సేవలందించాడు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు గౌరవాధ్యక్షునిగా కూడా వ్యవహరించాడు.




వ్యాపార రంగం: ఇతడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి జయభేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు.

రాజకీయాలు: ఇతడు రాజకీయాలలో కూడా ప్రవేశించి తెలుగు దేశం పార్టీలో చేరాడు. 2009లో జరిగిన 15వ లోకసభ ఎన్నికలలో రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి తెలుగు దేశం అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ కుమార్ చేతిలో 2,147 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. తిరిగి 2014లో 16వ లోకసభ ఎన్నికలలో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మురళీమోహన్ నటించిన చిత్రాలు:

పురస్కారాలు: 1985 లో ఓ తండ్రి తీర్పు సినిమా కి గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

error: