This Day in History: 1931-06-25

1931 : భారతదేశ 7వ ప్రధానమంత్రి విశ్వనాధ ప్రతాప్ సింగ్ జననం

విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (జూన్ 251931 – నవంబరు 272008), భారతీయ రాజకీయ నాయకుడు, భారతదేశ ఏడవ ప్రధానమంత్రిగా 1989 నుండి 1990 వరకు పనిచేసాడు. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన కులాలకు 27% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన ప్రధాని.




వ్యక్తిగత జీవితం: సింగ్ రాజస్థాన్ లోని డియోగర్-మడారియా రాజు కుమార్తె అయిన సితా కుమారిని 1955 జూన్ 25 న వివాహం చేసుకున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. ఈ వివాహం జరిగినపుడు అతనికి 24 సంవత్సరాలు, ఆమెకు 18 సంవత్సరాలు. కుమారి ఉదయపూర్ రాణాప్రతాప్ వంశమైన సిసోడియా రాజపుత్రి. వారికి ఇద్దరు కుమారులు. మొదటి కూమరుడు అజేయ సింగ్ (జ.1957) న్యూయార్క్ లో ఛార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసాడు. రెండవ కుమారుడు అభి సింగ్ ( జ. 1958) న్యూఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వైద్యుడు.

మరణం: వి.పి.సింగ్ ఎముకల మజ్జ క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యంతో బాధపడి 2008 నవంబరు 27 న న్యూఢిల్లీ లోని అపోలో ఆసుపత్రిలో మరణించాడు. 2008 నవంబరు 29 న అలహాబాదు లోని గంగా నదీ తీరంలో దహనం చేసారు. అతని కుమారుడు అజేయ సింగ్ అంత్యక్రియలను నిర్వహించాడు.




 

error: