This Day in History: 2007-06-26

2007: ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము/డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయము

ప్రారంభం.




డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయము (ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపశ్చిమ గోదావరి జిల్లాతాడేపల్లిగూడెం సమీపంలో వెంకటరమన్నగూడెం వద్ద ఉన్న రాష్ట్ర విశ్వవిద్యాలయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007లో ఈ విశ్వవిద్యాలయంను స్థాపించింది. ఉద్యాన శాస్త్రం ను చదవడానికి, పరిశోధనచేయడానికి ఈ విశ్వవిద్యాలయం ప్రోత్సాహం అందిస్తోంది.

చరిత్ర: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2007లో దీనిని స్థాపించింది. దీనితోపాటు మహబూబ్ నగర్ జిల్లా లోని మొజెర్లకడప జిల్లాలోని అనంతరాజుపేట లలో కూడా ఈ ఉద్యాన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆచార్య ఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ కోర్సులను అందిస్తున్నాయి. 2008లో మొదటి వైస్-ఛాన్సలర్‌ను నియమించే వరకు దీనిని ప్రభుత్వ అధికారి నిర్వహించేవారు. 2011లో దీనికి డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయముగా పేరు మార్చారు.

error: