This Day in History: 1976-06-28

1976 : బాలల కథా రచయిత, కార్టూనిస్టు, తెలుగు ఉపాధ్యాయుడు పెండెం జాగీశ్వర్ జననం

పెండెం జగదీశ్వర్ (జూన్ 281976 – జూలై 172018బాలల కథా రచయిత, కార్టూనిస్టు, తెలుగు ఉపాధ్యాయుడు. బాల సాహితీరత్నగా పేరుపొందడమేకాకుండా 2005లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం అందుకున్నాడు.

జననం: జగదీశ్వర్ 1976 జూన్ 28న చేనేత కుంటుబానికి చెందిన నరసింహ, సత్తమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంయాదాద్రి – భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో జన్మించాడు.

రచనా ప్రస్థానం: 1994 నుండి రచనలు చేస్తున్న జగదీశ్వర్ అనేక కథలు వ్యాసాలు రాశాడు. వాటిని పుస్తకాలుగా ప్రచురించాడు.

పుస్తకాలు:

  1. ఆనంద వృక్షం (పర్యావరణ కథల సంపుటి)
  2. పసిడిమొగ్గలు
  3. ఉపాయం
  4. గజ్జలదెయ్యం
  5. బాలల కథలు
  6. విడ్డూరాల బుడ్డోడు
  7. నూటపదహారు నవ్వులు
  8. తానుతీసినగోతిలో
  9. ముగ్గురు అవివేకులు
  10. విముక్తి
  11. ఆంధ్రప్రదేశ్ జానపదకథలు
  12. బడి పిలగాల్ల కతలు
  13. మాతో పెట్టుకోకు

గుర్తింపులు:

  1. తెలంగాణ మాండలికంలో పిల్లలు చెప్పుకునే ఇరవై జానపద, హాస్యకథలతో రాసిన `బడి పిలగాల్ల కతలు´(2015) అనే పుస్తకం తెలంగాణ మాండలికంలో వచ్చిన తొలి బాలల కథాసంకలనంగా ప్రశంసలందుకుంది. ఇందులోని ‘నాకోసం యెవలేడుస్తరు?, వొంకాయంత వొజ్రం’ కథలు మహారాష్ట్రలో ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలలో 2016-17 విద్యాసంవత్సరం నుండి పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టబడ్డాయి.
  2. తెలంగాణ మాండలికంలోనే ‘గమ్మతి గమ్మతి కతలు,(2016), దోస్తులు చెప్పిన కతలు'(2018) పుస్తకాలను కూడా ప్రచురించాడు.
  3. `చెట్టు కోసం ´కథ 2007 నుండి 2016 వరకు మహారాష్ట్రలో ఆరవ తరగతి తెలుగులో పాఠ్యాంశంగా కొనసాగింది.
  4. ప్రభుత్వ తెలుగు పాఠ్య పుస్తకాల (3వ తరగతి ప్రథమ భాష, 6, 7 తరగతులు ద్వితీయ భాష) రచనలో పాల్గొన్నాడు.
  5. వయోజనులు, నూతన అక్షరాస్యుల కోసం స్టేట్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో పలు పుస్తకాలు రాశాడు.
  6. సాక్షరభారత్ వాచక రూపకల్పనలో పాలు పంచుకున్నాడు.
  7. బాలసాహిత్య గ్రంథాల ప్రచురణలో రాజీవ్ విద్యామిషన్ కు సేవలందించాడు.
  8. నల్లగొండ జిల్లా ఆర్వీయం బాలల మాసపత్రిక `జాబిలి´కి సంపాదక వర్గ సభ్యునిగా పనిచేశాడు.

పురస్కారాలు:

  1. ‘ఉత్తమ బాలసాహితీ గ్రంథం’ పురస్కారం – ‘గజ్జెల దెయ్యం’ – తెలుగు విశ్వవిద్యాలయం (2005)
  2. మహాకవి శ్రీశ్రీ పురస్కారం
  3. ‘బాలసాహితీరత్న’ పురస్కారం – బాలసాహిత్య పరిషత్
  4. సాహితీ మేఖల, అక్షర కళాభారతి, చింతల స్వచ్ఛంద సంస్థలనుండి ఉగాది పురస్కారాలు
  5. వాసాల నర్సయ్య బాలసాహిత్య పురస్కారం
  6. గాడేపల్లి యువ సాహిత్య పురస్కారం
  7. తెలంగాణ ప్రతిభా పురస్కారం – 2017 (నటరాజ్ డ్యాన్స్ అకాడమీ, హైదరాబాద్, 28.07.2017) – తెలుగు వికీపీడియా కృషి

మరణం:

ఈయన 2018జూలై 17వ తేదీన చిట్యాల శివారులోని బాలనర్సింహ గుడి వద్ద రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

error: