అత్తమామలను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసిన కోడలు..

47

చంద్రగిరి మండలం బి.కొంగరవారిపల్లి గ్రామానికి చెందిన అబ్బూరి ప్రభాకర్‌, మునెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు. కూలి చేసి జీవనం సాగించే ఆ వృద్ధ దంపతులు కుమార్తెలు ఇద్దరికీ పెళ్లి చేశారు. కుమారుడు చిరంజీవిని బతుకుదెరువు కోసం దుబాయ్‌కు పంపారు. కొన్ని రోజుల తరువాత చిన్నరామాపురానికి చెందిన బాబు కుమార్తె కల్పనతో వివాహం జరిపించారు.

ఆ తర్వాత దుబాయ్‌ వెళ్లిన ఆ దంపతులు 5 సంవత్సరాల తరవాత ఇద్దరి మధ్యన గొడవలు తలెత్తాయి. ఏడాది క్రితం ఇద్దరూ దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి వచ్చారు. రెండు కుటుంబాల పెద్దలు నచ్చజెప్పినప్పటికీ సయోధ్య కుదరలేదు. దీంతో కల్పన తనకు జరిగిన అన్యాయాన్ని భర్త చిరంజీవి, అత్త మునెమ్మ, మామ ప్రభాకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.

ఆ కేసులో నిందితులైన అందరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తరువాత చిరంజీవి గుట్టుచప్పుడు కాకుండా దుబాయ్‌కు వెళ్లాడు. దీంతో తన బతుకు ఏమిటని కల్పన తన అత్త, మామలను నిలదీసింది. కేసు న్యాయస్థానంలో ఉన్నందున తామేమీ చేయలేమని వారు తేల్చి చెప్పారు. ఈనెల 14వ తేదీన అత్త ఇంటికి వచ్చిన కోడలు కల్పన తన కుటుంబీకులతో కలిసి ఆ ఇద్దరు వృద్ధులను బయటకు తోసి ఇంటికి తాళం వేసింది.

ఆ తరువాత గ్రామంలో జరిగిన పెద్దల మధ్యవర్తిత్వంతో ఇంటికి తాళం తీసిన కోడలు గత రెండు రోజుల క్రితం మళ్లీ తాళం వేశారు. కోడలు తాళం వేసినప్పుడల్లా… ఇంటి ముందే పడిగాపులు కాస్తున్నారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారా దంపతులు