రోడ్డు మీద డాన్స్ చేసి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆటో డ్రైవర్

36

మహారాష్ట్రలోని పుణె సిటీకి దగ్గరలోని బారామతి తాలుకాకు చెందిన బాబాజి కాంబ్లే అనే ఆటో‌డ్రైవర్ ఆటో స్టాండ్ లో తనకు వచ్చిన డాన్స్ అందరి ముందు ప్రదర్శించాడు. ఇటీవలే తన తోటి ఆటోడ్రైవర్ల ఎదుట ‘మల జావు ధ్యానా ఘరి’ అనే పాటకు మహారాష్ట్ర పాపులర్ డ్యాన్స్ ‘లవని’ స్టైల్‌లో పర్ఫార్మ్ చేసి ఫిదా చేశాడు.

ఆ ఒక్క వీడియోతో కాంబ్లే సెలబ్రిటీ అయిపోయాడు. ఈ వీడియోను మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ దయానంద్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయడం విశేషం. ఈ ట్రెండింగ్ వీడియో చూసిన మరాఠి ఫిల్మ్ డైరెక్టర్ ఘన్‌శ్యామ్ విష్ణు‌పంత్ యేడే తన సినిమాలో నటించాలని కాంబ్లేకు ఆఫర్ కూడా ఇచ్చారు. దీంతో కాంబ్లే ఉబ్బి తబ్బిబైపోతున్నాడు.