ఇంజినీరింగ్ విద్యార్దిని పై ఆటోడ్రైవర్ అత్యాచారం

51

హైదరాబాద్ లోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్ధిని పై అత్యాచారం చేసి నడిరోడ్డుపై బట్టలు లేకుండా వదిలిపెట్టేశాడు ఒక ఆటో డ్రైవరు. CMR ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంటికి వస్తుండగా జోడిమెట్లలోని పొదల్లోకి తీసుకెళ్ళి దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అమ్మాయిని వివస్త్రను చేసి రోడ్డుపై వదిలేసి ఆటోడ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు అమ్మాయిని రక్షించి మేడిపల్లిలో క్యూర్ హాస్పిటల్‌కి తరలించారు. ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆటోడ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనకు ఆటో డ్రైవర్ ఒక్కరే కారణమా? అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.