వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

39

ఫిబ్రవరి 27న ఢిల్లీలో ఆల్‌ టైమ్ గరిష్ఠ స్థాయికి పెట్రో ధరలు చేరుకున్న విషయం తెలిసిందే. పెట్రోలు ధర లీటర్‌కు రూ. 91.17కు, డీజిల్ ధర 81.47 చేరుకుంది. లేటెస్టుగా  బుధవారం లీటరు పెట్రోలు పై 18 పైసలు తగ్గడంతో లీటరు రూ.90.99కి దిగొచ్చింది. డీజిల్‌పై 17 పైసలు తగ్గడంతో ఇప్పుడు లీటర్ డీజిల్ ధర రూ.81.30కు చేరుకుంది.

ప్రస్తుత తగ్గింపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 94.61గా ఉండగా, డీజిల్ ధర రూ. 88.67గా ఉంది. ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ.97.40, రూ.88.42గా ఉండగా, చెన్నైలో రూ.92.95, రూ.86.29గా, కోల్‌కతాలో రూ.91.18, రూ.84.14గా ఉంది.