పోలీస్‌స్టేషన్‌లో చెలరేగిన మంటలు

30

బుధవారం తెల్లవారు జామున బీహార్ లో ముజఫర్పూర్ లోని మనియారీ పోలీస్‌స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. ఉదయం విద్యుత్‌ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు ప్రారంభమయ్యాయని, ఎంత నష్టం జరిగిందో అంచనా వేయడం కష్టమని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుజిత్‌ కుమార్‌ మిశ్రా తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందం సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే.. అగ్ని ప్రమాదంలో ఠాణాలోని ఫైళ్లు, ఆయుధాలకు సంబంధించిన సమాచారం తెలియరాలేదు.

  • 2
    Shares