బైక్‌పై హెల్మెట్ లేకుండా ప్రమాదకర స్టంట్ చేసి..

40

ఈ రోజుల్లో చాలామంది వ్యక్తులు ఫేమస్ కావడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యట్లేదు. జీవితాలను పణంగా పెట్టి మరీ భయంకరమైన స్టంట్స్ చేస్తూ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో, ఒక యువకుడు బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసం చేశాడు. కానీ, అనూహ్యంగా రెప్పపాటులో ఏం జరిగిందో చూస్తే ఆశ్చర్యపోతారు.

ఒక వీడియోను ఛత్తీస్ఘడ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ దిపాన్షు కబ్రా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. కొద్దిసేపటిలోనే అది కాస్తా వైరల్ అయింది. వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ‘దీపాన్షు కబ్రా’ షేర్ చేశారు. వీడియోను షేర్ చేస్తూ, ‘మీ పిల్లలకు / స్నేహితులకు ఇలాంటి స్టంట్స్ చేయకుండా చూసుకోండి, అలాంటి మూర్ఖపు పనులు చేయకుండా ఆపండి, ట్రాఫిక్ నియమాలను పాటించండి” అంటూ క్యాప్షన్ పెట్టాడు.

  • 5
    Shares