హెల్మెట్‌ పెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.? వీడియో..

42

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. హెల్మెట్‌ ఉన్నా కొందరు తలకు పెట్టుకోరు. తలకు పెట్టకున్నా దాన్ని లాక్‌ చేసుకోరు. స్ట్రాప్‌ పెట్టుకోకపోతే హెల్మెట్‌ తలపై ఉన్నా ఉపయోగం ఉండదు. యాక్సిడెంట్ జరిగినపుడు హెల్మెట్‌ ఎగిరి అవతలపడుతుంది.

ఇలాంటపుడు ప్రాణాల మీదకు వస్తుంది. ఇక్కడ హెల్మెట్ పెట్టుకున్నా సరే లాక్ చేసుకోకపోవడం వల్ల పేట బషీరాబాద్ లో ఒక బైకర్ కి గాయాలయ్యాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు జాగ్రత్త తీసుకోమని చెప్పడానికి ఆ వీడియో రిలీజ్ చేశారు.

 

  • 6
    Shares