బీజేపీ ఎంపీ కోడలు ఆత్మహత్యాయత్నం…. కారణం వారేనంటూ ఫిర్యాదు..

166

లక్నో: బీజేపీ ఎంపీ కౌశల్ కిశోర్ కోడలు అంకిత ఆత్మహత్యాయత్నం చేశారు. తన చేతి నరాలను తెగ్గోసుకునే ప్రయత్నం చేశారు. అంకితకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఆమె తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపారు.

ఈ సమాచారం అందుకున్న వెంటనే అలీగంజ్ ఎస్పీ అఖిలేష్ సింగ్ మూడు బృందాలను ఏర్పాటు చేసి, ఆమె కోసం గాలించారు. అర్థరాత్రి దాటాక ఆమె ఆచూకీ తెలుసుకుని, మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంకితకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక వీడియో ఐదు నిముషాలు ఉండగా, మరో వీడియో మూడు నిముషాలు ఉంది.

ఆ వీడియోలో ఆమె తన పుట్టింట్లో ఉంటూ భర్త కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొంది. ఇక అతను రాడని భావించి ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నానని తెలిపింది. తన ఆత్మహత్యకు భర్త, అత్తామామలే కారణమని అంకిత పేర్కొంది. ఈ వీడియోను చూసిన ఎస్పీ ఆమెను మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.