
ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహ జిల్లాలో ఓ దళిత బాలిక పై జరిగిన గ్యాంగ్ రేప్‌కు సంబంధించి 22 ఏళ్ల అంకిత్ నిందితుడిగా ఉన్నాడు. అతను జనవరి 18న జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితుడిగా ఉన్నాడు. అతని అక్క నేహ చౌదరి(24) ఎంబీఏ చేస్తూ నోయిడాలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది.
అయితే అంకిత్ ఈ కేసు నుంచి బయటపడేందుకు తన అక్కను చంపి ఆ నేరాన్ని గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబంపై నెట్టాలని అనుకున్నాడు. ఇలా చేయడం ద్వారా వారిని కాంప్రమైజ్ డీల్ ఒప్పిద్దామని భావించాడు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో ఉంటున్న నేహా ఇంటికి అతడు ఆదివారం ఓ కారు అద్దెకు తీసుకుని వెళ్లాడు. రేప్ కేస్ బాధితురాలి కుటుంబం కాంప్రమైజ్‌కు ఒప్పుకుందని నేహాను నమ్మించి కేసు నుంచి బయటపడటానికి సాయం కోరాడు.
ఇది నమ్మిన నేహా, అంకిత్‌తో కలిసి సోమవారం సాయంత్రం అమ్రోహ్కు చేరుకుంది. తొలుత అంకిత్ ఆమె గొంతుకోసి చంపాడు. అనంతరం ఇటుకతో ఆమె ముఖం గుర్తుపట్టకుండా చెక్కాడు. ఆ తర్వాత రక్తపు మరకలు అంటిన తన బట్టలను పొదల్లో పారవేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతదేహం సమీపంలో పడి ఉన్న బ్యాగ్‌లో రెండు మొబైల్ ఫోన్లు, ఓటర్ ఐడీ గుర్తించారు.
దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. “సీసీటీవీ ఫుటేజ్‌లో అంకిత్ నేహాను హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లడం గుర్తించాం. అనంతరం అంకిత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాం. ఈ సందర్భంగా అతను నేరాన్ని అంగీకరించాడు. జనవరి 18న జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అంకిత్, అతని కజిన్స్ నిందితులుగా ఉన్నట్టు పోలీసులుకు తెలిపాడు” అని అమ్రోహ ఎస్పీ తెలిపారు.
यूपी के अमरोहा में MBA की छात्रा की ईंट से कुचलकर हत्या कर दी गई. नेहा MBA की पढ़ाई के साथ नोएडा में बैंक में नौकरी करती थी.
रविवार को नेहा ने घर फोन कर कहा था कि शाम तक अमरोहा आ जाएगी. सोमवार को नेहा की लाश मिली. शव की पहचान वोटर ID से हुई. पुलिस की 3 टीमें जांच में जुटी हैं. pic.twitter.com/6jBYfsz4IJ
— Ranvijay Singh (@ranvijaylive) February 9, 2021
- 5Shares