ఒంగోలులో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..! మండిపడుతున్న నాయకులు

35

ప్రకాశం జిల్లా ఒంగోలు గొడుగు పాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న తేజశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. క్విస్ కాలేజీ యాజమాన్యం అధిక ఫీజుల కోసం వేధించటం వల్లే తేజశ్రీ ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. విద్యార్థిని తేజశ్రీ ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలంటూ చర్చ్ సెంటర్‎లో విద్యార్థులు మానవహారాన్ని చేపట్టారు. క్విస్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తేజస్విని ఆత్మహత్య వార్త మనసును కలచివేసిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఫీజు కట్టలేక విద్యార్థులు ప్రభుత్వం ఏం చేస్తోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి వల్లే తేజస్విని బలవన్మరణానికి పాల్పడిందని జనసేన ఆవేదన వ్యక్తం చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి పేద విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే చెల్లించాలని జనసేన డిమాండ్ చేసింది. తేజస్విని కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది.

  • 9
    Shares