వంతెన పై నుండి కాలువలో పడిపోయిన బస్సు, 40 మంది మృతి

40

మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. బస్సు సిధి నుంచి సత్నా జిల్లాకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినది.

బస్ డ్రైవర్‌తో సహా ఏడుగురు ప్రయాణికులు ఈత కొడుతూ ఒడ్డుకు చేరారని అధికారులు తెలిపారు. మిగతా ప్రయాణికుల కోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. డ్రైవర్ బస్ ని నీయంత్రించలేకపోవడంతో అదుపు తప్పిందని, కాలువలో పడకముందే బస్సు వంతెన గోడను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

 సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఇద్దరు మంత్రులు ఘటనా స్థలానికి వెళ్తున్నారని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

  • 6
    Shares