ఇకపై ఇంటి ముందు రోడ్డు పై కారు పార్క్ చేస్తే డబ్బు కట్టాల్సిందే..

36

కార్లు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారా ? ఇంటి ముందు రోడ్డుపై కారును పార్క్ చేస్తున్నారా? ఇకపై బెంగళూరు లో అలా కుదరదు. కర్నాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్, వాహనాల పార్కింగ్ సమస్యను నివారించేందుకు పార్కింగ్ పాలసీ 2.0 త్వరలోనే అమల్లోకి రానుంది. ఇందుకు గాను పట్టణ అభివృద్ధి శాఖ ఆమోదించింది.

అమల్లోకి వస్తే మాత్రం బెంగళూరు లో పబ్లిక్ రోడ్డుపై కారు నిలిపితే వెయ్యి నుంచి ఐదు వేల వరకు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక, త్రైమాసిక విధానంలో పార్కింగ్ పర్మిట్ ను ప్రజలు కోనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక పరిమిట్ కేవలం ఒక్క వాహనానికి మాత్రమే ఇస్తారు. వారు అనుమతించిన స్థలంలోనే వాహనాన్ని పార్కింగ్ చేయాలీ.

పార్కింగ్ కావాలసినంత కాలం పార్కింగ్ పర్మిట్ ను రెన్యూవల్ చేసుకోవాలి. నిబంధనలు పాటించకపోతే మాత్రం జరిమాన తప్పదు. చిన్న కార్లకు అయితే ఏడాదికి రూ.వెయ్యి మధ్యస్థాయి కార్లకు రూ.4 వేలు, ఎంయూవీ, ఎస్‌యూవీ వంటి పెద్ద కార్లకు రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఐతే హైదరాబాద్ లో కూడా ఈ విధమైన పాలసీ తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • 13
    Shares