చికెన్ పకోడీ తీసుకురాలేదని బాలుడిని కారుతో గుద్ది చంపేశాడు..

26

వీరవరం గ్రామానికి చెందిన సింగం ఏసు చికెన్‌ పకోడీ బండి నిర్వహిస్తుండగా, పదో తరగతి చదువుతున్న ఆయన కుమారుడు శివబాబు తండ్రికి సాయంగా పకోడీ బండి వద్ద ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన కొవ్వూరి వీరబాబు ఆదివారం రాత్రి పక్కనే మద్యం తాగుతున్నాడు.

తనకు చికెన్ పకోడీ తీసుకురావాలని శివబాబును వీరబాబు ఆదేశించాడు. అయితే వెంటనే పకోడీ తీసుకెళ్లకపోవడంతో వీరబాబు ఆగ్రహం చెందాడు. తన స్కార్పియో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయి, కొద్దిసేపటికి నేరుగా వచ్చి పకోడీ బండిని ఢీకొట్టాడు. దీంతో శివబాబుకు గాయాలయ్యాయి.

అనంతరం వీరబాబు స్కార్పియో దిగి ఇనుపరాడ్డుతో శివబాబును తీవ్రంగా కొట్టాడు. బాలుడిని కాకినాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామంలో పోలీసులను మోహరించారు. కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహిస్తున్నారు.