
దక్షిణ అమెరికా లోని కొలంబియాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హాస్పిటల్ వెయిటింగ్ రూంలోకి సడెన్‌గా దూసుకొచ్చిన ఆవు ఒక్కసారిగా రంకెలేస్తూ అక్కడ కూర్చుని ఉన్న పేషంట్లపై దాడి చేసింది. దాంతో అక్కడున్న ఆసుపత్రి సిబ్బంది, పేషెంట్లు ఎదుపడితే అటు పరుగులు తీశారు.
అక్కడ ఉన్న నలుగురు పేషెంట్ లపై ఆవు దాడికి చేయగా మరో ముగ్గురు తప్పించుకున్నారు. ఒక మహిళ పై మాత్రం ఆవు చాలాసేపటి వరకు దాడి చేసింది. ఆ ఆవుకి మెడకు ఓ తాడు కట్టి ఉండటంతో అది గమనించిన ఆస్పత్రి సిబ్బంది ఆ తాడు పట్టుకొని దాన్ని బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
మహిళా పేషెంట్ పై మరోసారి దాడి చేసేందుకు ప్రయత్నించగా ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలకు తెగించి ఆవు వెనక్కి వెళ్లారు. కాగా, వెనకవైపు ఉన్న ఆస్పత్రి సిబ్బందిని చూసిన ఆవు వారిపై దాడికి చేసేందుకు వాళ్లవైపు తిరిగింది. ఇంతలో తీవ్రంగా గాయపడిన మహిళా పేషెంట్ మెల్లగా లేచి… పక్కనే ఉన్న రూమ్‌లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంది.
- 10Shares