టాలీవుడ్ పై ఫైర్ అవుతున్న శాండిల్ వుడ్ హీరో..!

30

‘కేజీఎఫ్’ శాండిల్ వుడ్ ని ఇతర ఇండస్ట్రీల వరకు తీసుకుపోయింది. దీంతో మిగతా కన్నడ హీరోలు కూడా తమ సినిమాలను వేరే భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన కన్నడ హీరో దర్శన్ తన తాజా చిత్రం ‘రాబర్ట్’ ని తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించి పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే తన ‘రాబర్ట్’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడానికి ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు సహకరించడం లేదని దర్శన్ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే మార్చి 11న నాలుగు తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. యువ హీరో శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’.. మంచు విష్ణు-కాజల్ అగర్వాల్ ల ‘మోసగాళ్లు’.. శ్రీవిష్ణు-రాజేంద్ర ప్రసాద్ ల ‘గాలి సంపత్’.. నవీన్ పొలిశెట్టి-ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ కలసి నటించిన ‘జాతి రత్నాలు’ సినిమాలు శివరాత్రికి రిలీజ్ అవుతున్నాయి. ఈ నాలుగు తెలుగు సినిమాలకే అప్పుడు థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ‘రాబర్ట్’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి సహకరించడం లేదంటూ దర్శన్ కన్నడ ఫిలించాంబర్ ను ఆశ్రయించాడు. కర్ణాటకలో తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలు కూడా రిలీజ్ అవుతాయని.. కన్నడ సినిమాలను మాత్రం వేరే భాషల్లో విడుదల చేయడానికి సహకారం అందదని.. దీని వల్ల మన సినిమాలకు వైట్ ఇవ్వడం లేదని.. అలాంటప్పుడు ఇతర భాషా చిత్రాలకు మనం ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలని దర్శన్ ప్రశ్నిస్తున్నాడు.

  • 1
    Share