
మనం రోజు మనకు సరిపడా ఆహారం తీసుకుంటాము. కాని ఎంత తీసుకుంటే ఆరోగ్యం అనేది తెలియాలంటే ఈ విధంగా ఆహారాన్ని తీసుకోండి. రోజంతా ఎక్కువగా తినేయకుండా కొద్ది కొద్దిగా ఆహారం తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటీస్ (Diabetes) ఉన్నవాళ్ళు శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. రోజు మొత్తంలో మధ్య మధ్యలో శరీరానికి కార్బోహైడ్రేట్లు అందేలా చూసుకోవాలి.
ఆహారాన్ని ఒకేసారి తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. షుగర్ మందులు తీసుకున్నా సరే పరిస్థితి అదుపులో ఉండదు. డయాబెటీస్‌తో బాధితులు రోజు మొత్తంలో సమాన పరిమాణంలో శరీరానికి కార్బోహైడ్రేట్లు అందించాలి. అంటే.. ఒక్క సారే భోజనం చేయకుండా తక్కువ పరిమాణంలో కొంచెం కొంచెం ఆహారాన్ని తీసుకోవాలి. అధిక గ్లూకోజ్ మీ రక్తంలో చేరకుండా ఉంటుంది.
మూడు పూటల ఎక్కువ ఆహారాన్ని తీసుకొనేవారికి రోజంతా కడుపు నిండుగా ఉంటుంది. ఫలితంగా అనారోగ్యకర ఆహారాన్ని తీసుకోలేరు. ఒక వేళ మీరు వ్యాయమం చేస్తూ బరువు తగ్గే ప్లాన్‌లో ఉంటే ఎక్కువ ఆహారం తీసుకోవడం మంచింది. ఎక్కువ క్యాలరీలు అవసరమవుతాయి కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
తప్పకుండా మీ డైటీషియన్ లేదా వైద్యుడి సలహా తీసుకోవాలి. రోజంతా కొద్దికొద్దిగా ఆహారాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో చిరుతిండి తినొద్దు. కేవలం మీ శరీరానికి పోషకాలను అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారం, పాల ఉత్పత్తులు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. అయితే, ఆహారం తినకుండా ఉపవాసాలు చేయొద్దు.
ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ మానొద్దు. రోజు ఆరంభంలో మీరు తీసుకొనే ఆహారమే జీవక్రియను పెంపొందిస్తుంది. శరీరం వేడి కాకుండా చూస్తుంది. కాబట్టి రోజంతా మీ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోండి. దానికి తగినట్లే ఆహారాన్ని తీసుకోండి. ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి…
- 3Shares