న్యూస్

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు

51

ఐదేళ్ల చిన్నారిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. 2017లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యకేసులో ఇవాళ తీర్పు ఇచ్చిన కోర్టు నిందితుడు దినేష్‌కు మరణ శిక్ష విధించింది.

పాపను లేబర్‌ క్యాంప్‌లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశాడు దినేష్. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా ట్రయల్స్ నిర్వహించారు. ఇవాళ దినేష్‌కు మరణశిక్ష విధించింది కోర్టు.

కాగా, కొత్త చట్టాలు వచ్చినా.. కఠిన శిక్షలు పడుతున్నా.. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, దినేష్‌కు మరణశిక్ష విధించడంపై స్పందించిన ఐదేళ్ల చిన్నారి కుటుంబసభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

  • 19
    Shares