నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ పై స్పందించిన డైరెక్టర్ శంకర్

43

కోర్టు తనకు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసిందనే వార్తల్లో నిజం లేదని, కోర్టు ఆన్‌లైన్‌ వ్యవహారాల్లో జరిగిన చిన్న పొరపాటు వల్ల ఆ వారెంట్‌ జారీ అయ్యిందని డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెలిపారు.

అందులో ‘ఎగ్మూర్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు నాకు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసిందనే వార్తలు చూడగానే షాక్‌కు గురయ్యా. మా లాయర్‌ సాయికుమారన్‌ ఈ విషయంపై కోర్టును ఆశ్రయించగా స్పందించిన న్యాయమూర్తి ఎటువంటి వారెంట్‌ జారీ చేయలేదని తెలిపారు. కొన్ని పొరపాట్ల వల్ల ఆ నోటీసు జారీ అయింది వెంటనే దాన్ని సరిచేశారు. పూర్తి సమాచారాన్ని ధ్రువపరుచుకోకుండా ఒకరిపై తప్పుగా వార్తలు రాయడం ఆశ్చర్యం అనిపిస్తోంది. ఆ వార్తలు నా బంధువులు, స్నేహితులను కలవరపాటుకు గురిచేశాయి. దయచేసి ఇకపై ఇలాంటి విషయాల్లో తొందరపడకుండా, పూర్తి సమాచారాన్ని తెలుసుకుని వార్తలు రాస్తారని ఆశిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.

రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోబో’ చిత్ర కథ విషయంలో కాపీ రైట్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’ చిత్రం తెరకెక్కించే పనిలో శంకర్‌ ఉన్నారు.

  • 4
    Shares