1956 : అజ్మీర్ మెర్వాడ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుండి హరిభావు ఉపాధ్యాయ పదవి విరమణ చేశాడు.
1956 : ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి కోకా సుబ్బారావు పదవి విరమణ చేశాడు.
1984 : భారతదేశ 6వ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ప్రమాణ స్వీకారం చేశాడు.
1984 : ఆపరేషన్ బ్లూ స్టార్ కు నిరసనగా భారత ప్రధాని ఇందిరాగాంధీ పై సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ అనే ఇద్దరు సిక్కు సెక్యూరిటీ గార్డులు కాల్పులు జరిపి హత్య చేశారు. అల్లర్లు చెలరేగి 3,000 మందికి పైగా సిక్కులు చంపబడ్డారు.
2005 : భారత 35వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి రమేష్ చంద్ర లహోటి పదవి విరమణ చేశాడు.