కంటి అందాన్ని సహజసిద్ధంగా పెంపొందించుకునే చిట్కాలు

22

ముఖం లో అందాన్ని ముందుగా గుర్తించేది కళ్ళలోని. అందుకే కంటి యొక్క సహజ సౌందర్యాన్ని హైలైట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అమ్మాయిలు తమ కళ్ళు మరింత అందంగా ఉండాలని కోరుకుంటారు. కాంటాక్ట్ లెన్సెస్ వాడి తమ కంటి సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించే మహిళల గురించి మీరు వినే ఉంటారు. అంతెందుకు, సినిమాల్లోని హీరోయిన్ కళ్ళను హైలైట్ చేయడానికి కూడా కాంటాక్ట్ లెన్సెస్ ను వాడటాన్ని మీరు గమనించే ఉంటారు.

ఐతే, ఇప్పుడు మనం మాట్లాడుకునేది సహజసిద్ధమైన పద్ధతుల్లో కంటి అందాన్ని రెట్టింపు చేసుకునే ప్రాసెస్ గురించి. అనేక అంశాలు కళ్ళ అందాన్ని డేమేజ్ చేస్తాయి. కాలుష్య కారకాలు కావచ్చు, సూర్యుని హానికర కిరణాలు కావచ్చు, లేదా కంటి కింద చర్మంలోని తేమశాతం తగ్గడం వల్ల కావచ్చు, నిద్రలేమి కావచ్చు ఇలా ఎన్నో అంశాలు కంటి అందాన్ని పాడుచేస్తాయి.

యువీ రేస్ వలన పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. కంటి కింద చర్మం డార్క్ గా మారుతుంది. డార్క్ సర్కిల్స్ అనేవి నిద్రలేమి వల్ల కూడా వస్తాయి. ఫైన్ లైన్స్ అలాగే ముడతల వంటివి శరీరంలోని తగినన్ని యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోవడం వల్ల కూడా రావచ్చు. కాబట్టి, ముందు ఈ సమస్యలను సాల్వ్ చేసుకోవాలి. తగినంత నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి.

ఒత్తిడిని తగ్గించుకోవాలి. పోషకాహారాన్ని తీసుకోవాలి. తగినన్ని నీళ్లు తీసుకోవాలి. కంటి కింద చర్మాన్ని ఎప్పటికప్పుడు మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలి. సింపుల్ ఫేషియల్ మసాజ్ చేసుకోవాలి. దాంతో, బ్లడ్ సర్కులేషన్ మెరుగవుతుంది. కళ్ళు మరింత రిలాక్స్డ్ గా ఫీలవుతాయి. పఫీ ఐస్ సమస్య కూడా తగ్గుతుంది.

అలాగే, స్క్రీన్ టైంను తగ్గించడం కూడా ముఖ్యమే. మొబైల్ స్క్రీన్స్ అలాగే కంప్యూటర్ స్క్రీన్స్ ను ఎక్కువసేపు చూస్తూ ఉండటం వల్ల కళ్ళు అలసటకు గురవుతాయి. లుక్ పాడవుతుంది. ఈ జాగ్రత్తలతో మేకప్ లేకుండానే సహజసిద్ధంగా కంటి అందాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ జాగ్రత్తలతో మేకప్ లేకుండానే సహజసిద్ధంగా కంటి అందాన్ని పెంపొందించుకోవచ్చు.