మూడు రోజుల్లోనే 5 మిలియన్ ఇంస్టాల్స్.. రికార్డులు సృష్టిస్తున్న ఫౌజీ

24

ఫౌ-జీ (ఫియర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్‌) గేమ్ గూగుల్ ప్లే స్టోర్‌లో లాంచ్ అయిన మూడు రోజుల్లోనే ఏకంగా 50 లక్షలు ఇన్స్టాల్ కావడం విశేషం. ఫ్రీగేమ్స్‌లో తమదే టాప్ పొజిషన్‌లో ఉన్నదని ఎన్‌కోర్ గేమ్స్ వెల్లడించింది. త్వరలోనే ఈ గేమ్‌ను IOS లోనూ లాంచ్ చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. జనవరి 26న గేమ్ లాంచ్ అయిన తర్వాత తొలి 24 గంటల్లో 3 లక్షల డౌన్‌లోడ్లు దాటింది.

ఇండియాలో నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్‌కు పోటీగా ఈ గేమ్ మార్కెట్‌లోకి వచ్చింది. మేకిన్ ఇండియా ప్రచారంలో భాగంగా ఈ గేమ్‌ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రమోట్ చేశాడు. దీని ద్వారా వచ్చిన ఆదయంలో 20 శాతం భారత్ కే వీర్ ట్రస్ట్‌కు వెళ్తుంది. అయితే ఈ గేమ్ డౌన్‌లోడ్స్ భారీగానే ఉన్నా.. రీవ్యూలు మాత్రం నెగటివ్‌గా వచ్చాయి.

ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన గల్వాన్ లోయ థీమ్‌తో ఈ గేమ్ రూపొందింది. కానీ గేమ్ మాత్రం చాలా బోరింగ్‌గా ఉన్నదని, గ్రాఫిక్స్ మెరుగు పడాల్సి ఉన్నదని యూజర్లు రీవ్యూలు ఇచ్చారు. అయితే త్వరలోనే టీమ్ డెత్‌మ్యాచ్ పేరుతో కొత్త మోడ్‌ను తీసుకొస్తున్నామని, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుందని ఎన్‌కోర్ గేమ్స్ చెబుతోంది.