దేశంలోనే మొట్ట మొదటిసారిగా డబల్ ఏంఏ చేసిన ఒక మహిళ కు ఉరిశిక్ష

29

స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా దేశంలో ఒక మహిళ ఉరికంబం ఎక్కబోతోంది. ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహకు చెందిన షబ్నమ్ ను మథురై జైలులో ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంగ్లిష్‌లో ఎంఏ చేసిన షబ్నమ్ ఐదో తరగతి కూడా పాస్ కాని సలీంను ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంది. అందుకు ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ప్రియుడు సలీంతో కలిసి 2008లో తన కుటుంబంలోని ఏడుగురిని (తల్లిదండ్రులతోపాటు సోదరులు, ఓ చిన్నారి) గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపింది.

ఈ కేసులో స్థానిక కోర్టు వారికి ఉరిశిక్ష విధించగా వారు హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. అక్కడ కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేశారు. దీంతో చివరి ప్రయత్నంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని క్షమాభిక్ష కోరారు. కానీ ఆయన నిరాకరించారు.

దీంతో ఆమెకు విధించిన ఉరిశిక్ష ను అమలు చేయడానికి జైలు అధికారులు చర్యలు చేపట్టారు. తేదీ ఖరారు అయిన వెంటనే షబ్నమ్ ను మథురై జైలులో ఉరి తీస్తారు.

  • 10
    Shares