పొగలు కక్కి ఈల్‌ను మింగేసిన చేప..

43

ఓ పొడవాటి ఈల్ చేపను.. మరో చేప మింగే ప్రయత్నం చేసింది. పక్కాగా స్కెచ్ వేసి దాన్ని వేటాడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ఇలాంటి చేపను ఎప్పుడూ చూడలేదని, చేపలు కూడా ఇంత భయంకరంగా ఉంటాయా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విటర్‌లో ఓ భయంకరమైన చేప వీడియోను షేర్ చేశారు. ఓ చేప ఒడ్డున ఉన్న బురద మడుగు వద్దకు వెళ్లింది. నీటిలో ఉండే నోటితో దట్టమైన పొగలు వదిలింది. సిగరెట్ తాగినట్లుగా రసాయన చర్య జరిగినట్లుగా గుప్పు గుప్పుమని పొగలు వచ్చాయి. పొగలు వదిలిన తర్వాత ఆ చేప మెల్లగా నీటి లోపలికి మునిగి దాక్కుంది.

అనంతరం బుదర మడుగులో నుంచి ఓ భారీ ఈల్ చేప బయటకు వచ్చింది. పాములా ఉండే ఆ చేప పాకుతూ నీళ్ళలో తల పెద్దింది. అప్పటికే కాచుకొని ఉన్న ఆ మరో చేప ఈల్‌ను నోట్లోకి లాగేసుకుంది. కానీ అది చాలా పొడవు ఉండే సరికి పూర్తిగా మింగలేక మళ్లీ బయటకు వదిలిపెట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. కొందరు ఇది ఫెక్ అని కొట్టి పారేస్తున్నారు.

  • 11
    Shares