ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ… కారం బూందీలో ప్యాకింగ్

40

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీతో దొరికారు. ఎంతో తెలివిగా 54 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీ తినుబండారాల మధ్యలో పెట్టి విదేశాలకు తరలిస్తున్న ఇద్దరుప్రయాణికులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళుతున్న ఇద్దరు ప్రయాణీకుల వద్ద విదేశీ కరెన్సీ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా కరెన్సీ ని బూంది లో తీసుకొని వెళుతున్న సమయంలో అధికారుల బృందానికి వారిపై అనుమానం వచ్చి వారి బ్యాగేజ్ ను స్కానింగ్ చేశారు. తినుబండారాల ముసుగులో కరెన్సీ తరలిస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు వెంటనే ఆ ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • 1
    Share