పాల వ్యాపారం కోసం 30 కోట్ల రూపాయలతో హెలికాప్టర్ కొన్న రైతు

11

పాల బిజినెస్ కోసం 30 కోట్ల రూపాయలతో హెలికాప్టర్ కొనుగోలు చేశాడో రైతు. మహారాష్ట్రలోని భీవండికి చెందిన జనార్దన్ బోయర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. అయితే ఇటీవల పాల డెయిరీ బిజినెస్ స్టార్ట్ చేశాడు.

‘‘పాల వ్యాపారం కోసం నేను దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంటాను. అయితే చాలా ప్రాంతాలకు ఎయిర్ పోర్టు ఫెసిలిటీ లేదు. కారు, బస్సు, రైలులో వెళ్లాలంటే గంటలకొద్దీ టైమ్ పడుతోంది. అందుకే ఫ్రెండ్ సలహా మేరకు హెలికాప్టర్ కొన్నాను” అని చెప్పాడు జనార్దన్.

ఆయన ఆర్డర్ ఇచ్చిన కంపెనీ ట్రయల్ కోసం హెలికాప్టర్ ను ఇప్పటికే జనార్దన్ ఊరికి పంపించింది. మార్చి 15న హెలికాప్టర్ డెలివరీ కానుంది. ఇందుకోసం 2.5 ఎకరాల్లో హెలిప్యాడ్, హెలికాప్టర్ గ్యారేజ్, పైలట్, టెక్నీషియన్ రూమ్స్ నిర్మించనున్నారు.

జనార్దన్ కు రూ.100 కోట్ల ఆస్తులున్నట్లు తెలుస్తోంది. ఆయనకు భీవండిలో గోదాములు ఉన్నాయి. వాటికి వచ్చే కిరాయి ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది.

  • 12
    Shares