మొత్తానికి ఫేస్‌బుక్ పోస్ట్ తో కలెక్టర్‌ను కదిలించారు.

42
అనంతపురం జిల్లాలో మారుమూల ఉండే మండల కేంద్రం బ్రహ్మసముద్రం కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది. ఉన్నత పాఠశాల సౌకర్యం ఉన్న మండల కేంద్రం కావడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల విద్యార్థులు చదువుకోవాలంటే బ్రహ్మసముద్రానికి రావాల్సిందే. గొంచిరెడ్డి పల్లి, నాగిరెడ్డి పల్లి వంటి గ్రామాల నుంచి పలువురు విద్యార్థులు బ్రహ్మసముద్రానికి చేరుకోవడానికి ఎలాంటి బస్సు వసతి లేదు. కాలినడకన లేదా షేర్ ఆటోల మీద ఆధారపడి వారు తమ గ్రామాల నుంచి ఉన్నత పాఠశాలకు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉండేది.
https://i.imgur.com/R4sBKog.jpg
తమ దుస్థితిని వివరిస్తూ గొంచిరెడ్డిపల్లి, నాగిరెడ్డి పల్లి గ్రామాలకు చెందిన కొందరు విద్యార్థినులు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. గొంచిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన తాము బ్రహ్మసముద్రంలో ఉన్నత పాఠశాలను చేరుకోవడానికి రోజూ 10 కిలోమీటర్ల దూరం నడుస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కించాలని, ఆర్టీసీ బస్సును నడింపించేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించాలంటూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు విజ్ఞప్తి చేశారు.
https://i.imgur.com/aEk3tbH.jpg
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి కలెక్టర్ దృష్టి కి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్పందించి ఆర్టీసీ అనంతపురం రీజనల్ మేనేజర్‌ను సంప్రదించారు. వెంటనే బస్సును ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. సమీపంలోని కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపో నుంచి బస్సు సౌకర్యాన్ని కల్పించారు.. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చేతుల మీదుగా బస్సును లాంఛనంగా ప్రారంభించారు.
  • 50
    Shares