వాళ్ళకు ఫ్రిజ్‌ అవసరం లేదు గంగినాలు చాలు..

48

అఫ్ఘానిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో పండ్లు నిల్వ చేసుకోవడానికి ఫ్రిజ్‌లపై ఏమాత్రం ఆధారపడరు. ద్రాక్ష వంటి పండ్లను ఆరునెలల పాటు చెక్కుచెదరకుండా నిల్వ చేసుకోవడానికి వారు పురాతనమైన సంప్రదాయ పద్ధతినే ఇప్పటికీ నమ్ముతున్నారు.

ఎలాంటి పండ్లనైనా ఆరునెలల పాటు తాజాదనం చెక్కుచెదరకుండా నిల్వచేసే ఈ ప్రక్రియ పేరు ‘గాంగినా’. ఈ పద్ధతిలో తడి బంకమట్టితో బుట్టల్లాంటివి తయారు చేసి, వాటిలో తాజా పండ్లు ఉంచి, గాలి లోనికి రాకుండా వాటిని మూసివేస్తారు.

అవి పూర్తిగా ఎండిపోయే వరకు ఎండలో ఆరబెడతారు. ఎండిన బుట్టలను చీకటి గదుల్లో నిల్వ ఉంచుతారు. పండ్ల దిగుబడి లేని రుతువులో ఈ ‘గాంగినా‘ బుట్టలను తెరిచి, ఇందులోని పండ్లను వాడుకుంటారు.

  • 4
    Shares