నిండు గర్భిణీ.! బెల్లీ డాన్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది..

44

యూట్యూబ్ లో ఒక వీడియో వైరలవుతున్నది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చే మూడు రోజుల ముందు బెల్లీ డాన్స్ చేసింది. బెల్లీ డాన్స్ అంటేనే బాడీలోని ప్రతి పార్ట్ ను కదిలించాల్సి ఉంటుంది.

ఇలాంటి డాన్స్ ను సాధారణ సమయంలో చేయడమే కష్టమనుకుంటే.. ఈ మహిళ మాత్రం తాను పాపకు జన్మనివ్వడానికి మూడు రోజుల ముందే చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి. ఈ వీడయో నెట్టింట వైరల్ గా మారింది.

కాగా ప్రెగ్నెంట్ గా ఉన్న వారిని మంచం కూడా దిగనీయకుండా చేస్తే అది వారికే ప్రమాదమట. చిన్న చిన్న ఎక్సర్సైజ్ లు చేస్తేనే తల్లికి, పుట్టబోయే బిడ్డకు శ్రేయస్కరం అని వైద్యులు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఒక అథ్లెట్.. తాను 9 నెలల గర్భిణీ అయి కూడా రికార్డు సమయంలో పరుగు పందాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే.