8 నెలల గర్భిణీ ని 3 కిలోమీటర్లు నడిపించింది..

36

ఒడిస్సా లోని మయూర్ బంజ్ జిల్లా నోట గ్రామం లో 8 నెలల గర్భిణి, భర్త మోటర్ సైకిల్ పై పోతున్న సమయంలో, ఆ బైక్ ఆపి భర్తకు హెల్మెట్ ఉన్నా, వెనకున్న భార్యకు హెల్మెట్ లేదని ప్రశ్నించింది లేడీ ఎస్సై రీనా బక్సల్. తన భార్య పురిటి నెప్పులతో ఉందని, ఆస్పత్రికి తీసుకెళ్తున్నానని, ఫైన్ వేస్తే చెల్లిస్తానని ఆ భర్త చెప్పాడు. ఆమె వేసిన ఫైన్ కి సరిపడా డబ్బులు లేకపోవడంతో, ఆన్ లైన్ లో డబ్బులు కడతానన్నాడు.

అయినా ఆ మహిళా ఎస్సై వినకుండా బైక్ తాళాలు తీసుకుంది. ఎర్రటి ఎండలో బైక్ స్టేషన్ కి తీసుకు రమ్మని తన సిబ్బందికి ఆదేశించింది. వారితోపాటు భర్త, భార్య కూడా స్టేషన్ కి వచ్చారు. భర్త, భార్యను ఆ ఎండలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్ కి నడిపించి తీసుకెళ్లాడు. దీంతో ఆమెకు తీవ్రమైన అనారోగ్యం వచ్చి సొమ్మసిల్లి పడిపోయింది.

ఈ విషయం తెలిసిన వెంటనే మయూర్ బంజ్ ఎస్పీ, ఆ మహిళా పోలీస్ అధికారిని సస్పెండ్ చేశాడు. తన భార్య గర్భంతో ఉన్నప్పుడు ఎండలో 3 కిలోమీటర్లు నడిపించడమే కాకుండా తనను అకారణంగా జైలుగదిలో పెట్టి 3 గంటలపాటు వేధించిందని తన భార్యను ఎండలోనే నిలబెట్టిందని విక్రమ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యకు హెల్మెట్ లేదన్న ఒకే ఒక్క కారణంతో ఇంత రభస సృష్టించిందని అన్నాడు.