గోల్డ్ చైన్ ను ఎత్తుకుపోతున్న చీమలు అరెస్టు చేశారా.. లేదా?

33

ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి డిపాన్షు కబ్రా ఐపీఎస్ అధికారి ట్విట్టర్ వేదికగా పలు వీడియోలను పోస్టు చేస్తుంటారు. అందులో కొన్ని ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. మరికొన్ని సరదగా ఉంటాయి. 2021, మార్చి 24వ తేదీన ఓ వీడియోను పోస్టు చేశారు.

కొన్ని చీమలు బంగారం గొలుసును తీసుకెళుతుంటాయి. ఈ వీడియోకు స్మాలెస్ట్ గోల్డ్ స్మగ్లర్స్ అని పేరు పెట్టారు. 15 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియో చూసి నెటిజన్లు సరదా సరదా కామెంట్స్ పెడుతున్నారు. పలువురు సైటెర్లు వేశారు. దొంగ చీమలను అరెస్టు చేశారా ? లేక అవి తప్పించుకున్నాయా ? అంటూ హాస్యమాడారు.