గ్వాలియర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది అంగన్‌వాడి..

21

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో తెల్లవారు జామున ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. 18 మంది అంగన్‌వాడి కార్యకర్తలు రెండు ఆటోలను మాట్లాడుకుని గ్వాలియర్ నుంచి బయలుదేరారు. దారిలో ఒక ఆటో ఇంజిన్‌ లోపంతో ఆగిపోయింది. దాంతో వారంతా ఒకే ఆటోలో ఎక్కారు.

పురానీ ఛావ్‌నీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగా మాలన్‌పూర్ వద్ద ఆటో వెళ్తోండగా.. మురైనా నుంచి గ్వాలియర్‌ వైపునకు వస్తోన్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా అందులో ప్రయాణిస్తోన్న వారిలో 13 మంది మృతిచెందగా మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, పురానీ ఛావ్‌నీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని గ్వాలియర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తీసుకెళ్లారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పారిపోగా అతని కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

మృతులందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం, వారంతా ఒకేచోట పని చేస్తోన్న అంగన్‌వాడి కార్యకర్తలు కావడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రధాని మోది చనిపోయిన కుటుంబాలకు పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 50వేలు చప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

  • 2
    Shares