బెయిల్ పై బయటకు వచ్చి.. అత్యాచార బాధితురాలి తండ్రిని కాల్చి…

30

2018లో గౌరవ్ శర్మ అనే వ్యక్తి హత్రాస్ జిల్లాలో ఓ యువతిపై ఆత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. నిందితుడు బెయిల్ మీద వచ్చి గ్రామంలో ఉంటున్నాడు. అప్పటినుంచి ఇరు కుటుంబాల మధ్య అంతర్గతంగా వైరం నడుస్తోంది. ఈ క్రమంలో గౌరవ్ శర్మ ఆత్యాచార బాధితురాలి తండ్రిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు.

గతంలో తనపై వేధింపులకు పాల్పడిన నిందితుడిని జైలుకు పంపించామన్న అక్కసుతోనే తన తండ్రిని కాల్చిచంపాడని బాధితుడి కుమార్తె కన్నీరుమున్నీరైంది. తనకు న్యాయం చేయాలని వాపోయింది. నిందితుడు గౌరవ్ శర్మతో పాటు కాల్పులకు పాల్పడిన మరికొందరు పరారీలో ఉన్నారని ఇప్పటికే ఈ కేసులో గౌరవ్ శర్మ కుటుంబ సభ్యుడు ఒకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో నిందితులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయాలంటూ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. హత్రాస్ లోని నౌజార్ పూర్ అనే గ్రామంలో మూడేళ్ళ క్రితం ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిపై కేసు దాఖలు చేశారు. ఒకరిని అరెస్టు చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. లోగడ హత్రాస్ లో ఓ యువతి పై గ్యాంగ్ రేప్ జరగడం, ఆ యువతి మృతి చెందిన విషయం తెలిసిందే.

  • 5
    Shares