9వ తరగతి చదివి సొంత బైక్ రెడీ చేసుకున్నాడు..

42

తొమ్మిదో తరగతి గట్టెక్కేసాడు కానీ పదవ తరగతి చదవలేదు. కరోనా టైమ్‌లో మెదడుకి పని చెప్పి సొంతంగా బైక్ తయారుచేసుకున్నాడు. అంతేకాదు దానిపై దర్జాగా తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఛత్తీస్‌గఢ్ లోని ధామ్తారీకి చెందిన సయ్యద్ సైఫ్ కనీసం సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కునేంత స్థోమత కూడా లేదు. ఓ రోజు సొంత బైక్ తానే తయారుచేసుకోవాలని ఆలోచన వచ్చింది.

చుట్టుపక్కల వేర్వేరు మెకానిక్ షాపుల నుంచి మూలన పడేసిన రకరకాల బైక్ పార్టులను తెచ్చాడు. తన ఇంటికి దగ్గర్లో తిరిగే బైకులను బాగా గమనిస్తూ సరిగ్గా అలాగే తన దగ్గర ఉన్న పార్టులను బిగించాడు. కొన్ని పార్టుల అసెంబ్లింగ్‌కి యూట్యూబ్ వీడియోలు చూశాడు. మొత్తానికి చక్కటి బైక్ తయారుచేసుకున్నాడు.

సయ్యద్ తన బైకుకి… సుజుకి ఇంజిన్ వాడాడు. యమహా బాడీ, స్కూటర్ చక్రాలు వాడాడు. మొత్తం 5 రకాల వాహనాల పార్టులు దీనికి సెట్ చేశాడు. ఇందుకోసం అతను ఎక్కడా ట్రైనింగ్ తీసుకోలేదు. ఎన్నోసార్లు ఫెయిలై… చివరకు సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు చాలా మంది ఈ బైక్ బాగుందంటున్నారు. తమకు అమ్మితే కొనుక్కుంటామని ఆఫర్ ఇస్తున్నారు. కానీ సయ్యద్ దాన్ని అమ్మే ఉద్దేశంతో లేడు.

ధామ్తారీ జిల్లాలో… సింగపూర్ అనే గ్రామంలో సయ్యద్ తండ్రి ఓ సైకిళ్ల మెకానిక్. సయ్యద్ తన తండ్రితో చేరి మెకానిక్ అయ్యాడు. చాలా నేర్చుకున్నాడు. ఇప్పుడు అతనికి చెయ్యడానికి చాలా పని ఉంది. అస్సలు ఖాళీ లేదు. కరోనా టైమ్‌లో కూడా బోలెడంత పని ఉంది. దీనికి తోడు ఆ పనిలో అతని ఎక్స్‌పర్ట్ అయిపోయాడు. అందువల్లే సొంతంగా బైక్ తయారుచెయ్యగలిగాడు