నేను చనిపోయాను.. నన్ను మళ్ళీ బ్రతికించారు

39

హైదరాబాద్ లోని సరూర్‌నగర్‌కు చెందిన కనకారెడ్డి (44) డిసెంబర్‌ లో అపోలో ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నాడు. కార్డియోమయోపతి ఉందని, గుండె మార్పిడి చేయాలని వైద్యులు చెప్పారు. జనవరిలో జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేయించారు. ఎల్ బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ నిరుపేద రైతు బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అవయవాలు ఇవ్వడానికి ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు.

అత్యవసరంగా మెట్రో ద్వారా గుండెను తరలించి రోగి ప్రాణాలు నిలిపినట్లు డాక్టర్‌ గోఖలే చెప్పారు. మరుసటి రోజు నుంచే రోగి కోలుకున్నాడని, మూడోవ రోజునే అతను ఐసీయూలో నడిచాడని చెప్పారు. పన్నెండు రోజుల్లో పూర్తిగా కోలుకున్నాడని, సోమవారం డిశ్చార్జి చేస్తున్నామని, అతను సాధారణ జీవితం కొనసాగించవచ్చునని వివరించారు.

అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ అధ్యక్షుడు డాక్టర్‌ హరిప్రసాద్‌ మాట్లాడుతూ ఎంతో బాధలో ఉన్నప్పటికీ అవయవదానానికి ముందుకు వచ్చి దాత కుటుంబం మానవత్వాన్ని చాటిందన్నారు. ఆపరేషన్‌కు ముందు బతుకు పై 5 శాతం మాత్రమే నమ్మకం ఉండేదని, ఇప్పుడు 105 శాతం భరోసాతో ఇంటికి వెళ్తున్నానని కనకారెడ్డి చెప్పారు.

  • 2
    Shares