అమ్మాయిలు నచ్చలేదు.. బొమ్మను పెళ్లి చేసుకున్నాడు..

43
హాంకాంగ్‌కు‌ చెందిన జీ తియాన్‌రాంగ్‌ అనే 36 ఏళ్ల వ్యక్తి అమ్మాయి కంటే బొమ్మతోనే డేటింగ్‌ నచ్చిందని మోచి అనే బొమ్మని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు మోచీకి ఐఫోన్‌ 12 లాంటి అనేక గిఫ్టులిస్తూ మురిసిపోతున్నాడు. తోడు కోసం లక్ష రూపాయలకు మోచీని కొనుక్కున్నాడంట.
ఎక్కువ సేపు మొబైల్స్‌తో గడిపే గర్ల్‌ఫ్రెండ్స్‌ కంటే ఈ సెక్స్‌ డాల్‌ చాలా బెటరంటున్నాడు జీ. అందుకే దాన్ని పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. అయితే మోచీ కందిపోతుందని ఇప్పటికీ ముద్దు కూడా పెట్టలేదట. ఇప్పుడు ఆ బొమ్మకు 20 జతల ఖరీదైన బట్టలు, 10 జతల షూస్ ఉన్నాయి. కాగా గతేడాది నవంబర్‌లో కజకిస్తాన్‌కు చెందిన ఓ బాడీ బిల్డర్‌ సెక్స్‌ డాల్‌తో డేటింగ్‌ చేసి దానినే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.