లావా పైనే హాట్ డాగ్, గుడ్లు వండుకు తింటున్నారు..

38

ఐస్లాండ్ రాజధాని రేక్‌జావిక్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫగ్రడాల్స్‌ఫాల్ అగ్నిపర్వతం సమీపంలో విస్ఫోటనం చెందింది. వందల సంవత్సరాలలో మొదటిసారిగా విస్ఫోటనం జరిగింది. ఈ ప్రాంతంలో విస్ఫోటనం గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు పర్వత ప్రాంతంపై లావా ప్రవహించే అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

హాట్ లావాలో హాట్ డాగ్ మరియు బన్నులను వంట చేస్తున్న శాస్త్రవేత్తల వీడియోను న్యూస్ ఏజెన్సీ ‘రాయిటర్స్’ యూట్యూబ్ లో షేర్ చేసింది. వారు సాసేజ్‌లను వండడానికి లావాను ఒక పెద్ద గ్రిల్‌గా ఉపయోగించారు.

గుడ్లు వండుతున్న మరో బృందం యొక్క మరొక వీడియోను యూరుకుర్ హిల్మార్సొన్మ్ యూట్యూబ్‌లో పంచుకున్నారు. అతను ఒక బండపై ఒక గుడ్డు పగులగొట్టి బేకన్ లో వేయించడాన్నీ మనం వీడియో లో చూడవచ్చు.

విస్ఫోటనం జరగడానికి ముందు నాలుగు వారాల్లో ఆ ద్వీపకల్పంలో 40,000 భూకంపాలు సంభవించాయి. ఈ ప్రాంతంలో నో-ఫ్లై జోన్ కూడా పెట్టారు, కానీ అదృష్టం ఏంటంటే విస్పోటనం వల్ల ప్రజలకు ఎటువంటి హాని కలిగించలేదు.