ఆరుగురు యూకే నుండి వచ్చిన ప్రయాణికులకు కరోనా? ఇండియాకు కొత్త వైరస్ వచ్చేసిందా?

19

యూకే ను వణికిస్తున్న కరోనా న్యూ వెర్షన్ వైరస్ ఇండియాను హడలెత్తిస్తోంది. యూకే నుంచి ఎయిర్ ఇండియా విమానం సోమవారం రాత్రి 10.40 గంటలకు న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇందులో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆ ఆరుగురు ప్రయాణికుల్లో ఒకరు చెన్నైకి కనెక్టింగ్ విమానం ద్వారా వచ్చారు. అక్కడి విమానాశ్రయంలో అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఆ విమానంలో క్రూ సిబ్బందితో సహా మొత్తం 266 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారికి సోకింది కొత్త వైరస్ అనే విషయమై ఇంకా స్పష్టత లేదని ప్రభుత్వ అధికారి అవనీశ్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల శాంపిల్స్‌ను పుణె వైరాలజీ ల్యాప్ పంపించామని.. పరీక్షల ఫలితాలు వచ్చాకే కరోనా సోకింది లేనిది తెలుస్తుందని చెప్పారు.

మంగళవారం ఉదయం బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో భారత్‌కు వచ్చిన ప్రయాణికులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. పలు దేశాలు ఇప్పటికే యూకే నుంచి విమానాల రాకపోకలను నిషేధిస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి యూకే విమానాల రాకపోకలపై భారత్ కూడా నిషేధం విధించింది. ఈ నిషేధ డిసెంబర్ 31వరకు అమలులో ఉంది.

  • 1
    Share